కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జిల్లా పాలనాధికారి శశాంక పర్యటించారు. పట్టణంలోని గాంధీనగర్, కాకతీయ కాలనీ, మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ ప్రాంతాలను పరిశీలించారు.
ఆర్డీవో, తహసీల్దార్, సీఐలతో మాట్లాడారు. తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్థానికులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కంటైన్‌మెంట్ ప్రాంతాల నుంచి ఎవరినీ బయటకు రాకుండా చూడాలన్నారు. నిత్యవసర వస్తువులను అక్కడికే పంపించాలన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలన్నారు.
ఇవీచూడండి: వైద్యులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు: ఈటల