ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ - కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలిక వార్తలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాపరిషత్ ఛైర్మన్ కనుమల్ల విజయ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె వ్యాఖ్యానించారు.

kalyana lakshmi shadhi mubarak cheques distribution in jammikunta karimnagar district
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల చెక్కుల పంపిణీ
author img

By

Published : Oct 8, 2020, 6:55 PM IST

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పురపాలికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను జిల్లాపరిషత్ ఛైర్మన్ కనుమల్ల విజయ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలోని 14 గ్రామాలకు చెందిన 77 మంది లబ్ధిదారులకు 76.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె అన్నారు. ఈ పథకాలు నిరుపేదలకు ఓ వరం లాంటివన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రైతులకు బీమా చెక్కుల అందజేత: ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.