కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు ప్యాకేజీలను అనుసంధానించే ప్రాజెక్టులో నీరు అడుగంటడం వల్ల ఎల్లంపల్లి సమీపంలోని పార్వతి పంప్ వద్ద మూడు మోటార్ల ద్వారా 7వేల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నారు. కొంతకాలంగా ఎల్లంపల్లి జలాశయంలోని నీటిని నంది పంప్ ద్వారా గాయత్రి పంప్ హౌజ్‌కు అక్కడి నుంచి మధ్యమానేరు తరలిస్తున్నారు.
ఈనెల 14 నుంచి గాయత్రి పంప్‌హౌజ్ ద్వారా 10 టీఎంసీల నీటిని మధ్యమానేరుకు తరలించారు. ప్రస్తుతం గాయత్రి పంప్ వద్ద 5మోటార్ల ద్వారా 15వేల క్యూసెక్కులు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలో నీరు ఎనిమిదిన్నర టీఎంసీలకు తగ్గిపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎత్తిపోసే అసలు ప్రక్రియ ఊపందుకుంది. ఎల్లంపల్లి జలాశయంతో పాటు పార్వతిపంప్ హౌజ్ వద్ద నీటిని ఎత్తిపోస్తున్న తీరును మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం