కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూహెచ్ స్థాయి జూడో పోటీలు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి దిలీప్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న అన్ని కళాశాలల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో రాష్ట్రస్థాయి జట్టు తయారుచేసి... కాన్పూర్లోని బరేలీ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రోడ్డెక్కిన చేపలు.. స్తంభించిన రాకపోకలు