క్షణం తీరిక లేకుండా విధులను నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సంబురాల్లో మునిగిపోయారు. 1984లో హుస్నాబాద్‌లో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న మిత్రులతో కలిసి బడి సూక్తులు పేరుతో కరీంనగర్లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తోటి స్నేహితులతో స్టెప్పులు వేశారు. తరగతి గది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. స్నేహానికి గుర్తుగా 2021 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తీపి గుర్తులను గుర్తుచేసుకుంటూ స్కిట్ వేశారు. జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్... నిక్కర్ వేసుకొని స్కిట్లో పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ లాల్ వేసిన స్టెప్పులతో తోటి స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: 'నిరుపేదల సొంతింటి కల తెరాస ప్రభుత్వంతోనే సాధ్యం'