కరీనంగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాగోజు నాగభూషణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదటి నుంచి పోరాటాలు చేసిన బండి చంద్రశేఖర్‌కు ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని తెలంగాణ చౌక్‌లో అందించారు. తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని ఆచార్య జయశంకర్ అని ఆయన కొనియాడారు.
జీవితాన్నే అంకితం...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి అందించి... స్ఫూర్తి ప్రదాతగా, తెలంగాణా సిద్ధాంతకర్తగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కీర్తించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం ముందు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : కరోనా బాధితుల్లో ధైర్యం నింపేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి: ఈటల