జలమే జగతికి జీవనాధారం. అలాంటి జలాలను పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్ తరాల మనుగడకు దోహదం చేయాలని జల శక్తి అభియాన్ అధికారుల బృందం తెలిపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, వెదిర గ్రామాల్లో చేపట్టిన జల సంరక్షణ పనులను వారు పరిశీలించారు. వెలిచాలలో ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రభుత్వ స్థలాల్లో నీటి గుంటలు వినియోగ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక అధికారి సతీందర్ పాల్ సూచించారు. వెలిచాల గ్రామపంచాయతీ ముందు భాగంలో కొత్తగా మొక్కలు నాటారు.
ఇదీ చదవండిః తెరాస నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం