కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ కళాశాలకు అరుదైన గౌరవం లభించింది. విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల ప్రజ్ఞ స్థాయి, నాణ్యత ప్రమాణాలను గుర్తించిన కళాశాల విద్యా శాఖ కమిషన్ ఐఎస్వో సర్టిఫికెట్‌ను ప్రదానం చేసింది.
కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణకు విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ధ్రువపత్రాన్ని అందించారు. తమ కళాశాల గొప్పతనాన్ని గుర్తించి ఐఎస్వో సర్టిఫికెట్ ఇచ్చినందుకు కళాశాల విద్యా శాఖకు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!