farmers protecting crops with tankers: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటి సరఫరా లేక రైతులు ట్యాంకర్లతో పంటలను కాపాడుకుంటున్నారు. గంగాధర, కొడిమ్యాల మండలాల్లో సుమారు మూడు వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైను ద్వారా ప్రతి ఏటా సాగునీరు అందజేస్తున్నారు.
ఈసారి కటికెనపల్లి వద్ద మరమ్మతుల పనులు సాగడంతో సాగునీటి కొరత ఏర్పడింది. పర్యవసానంగా వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా పంటలకు సాగునీరు సరఫరా చేస్తున్నారు. మరికొందరు నారాయణపూర్ చెరువులోని నీటిని కాలువలు తవ్వి తరలిస్తున్నారు. యాసంగి పంటలను రక్షించుకునేందుకు ఇలా కష్టాలు పడుతున్నామని రైతులు వాపోయారు.
ఇదీ చదవండి: శీతల ప్రాంతంలోనే కాదు... తెలంగాణలో కూడా పండించొచ్చని నిరూపించాడు!