ఇదీ చదవండిఘనంగా అట్టుకల్ పొంగల్
వైద్యం అందక శిశువు మృతి - hospital
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం పేదలపాలిట శాపంగా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య సౌకర్యాలు సైతం దేవతా వస్త్రాన్ని తలపిస్తున్నాయి.
శిశువు మృతి
కరీంనగర్లోని మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్కి చెందిన స్వప్న పురిటి కోసం మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో రక్త పరీక్ష సామగ్రిలేనందున వైద్య పరీక్షలకు ఆలస్యం అయింది. ప్రసవం అయిన వెంటనే పసికందు మృతిచెందింది.అంతావాళ్లే చేశారునొప్పులు ఎక్కువయ్యాయని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే తన పాప దక్కేదని కన్నీళ్లపర్యంతమైంది. నర్సులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండిఘనంగా అట్టుకల్ పొంగల్
Intro:ఈ ఏడాది మిరప సాగు చేసిన రైతులు దిగుబడి రాక ధరలు లేక అష్టకష్టాలు పడుతున్నారు ఖమ్మం జిల్లాలో సుమారు నలభై ఏడు వేలకు పైగానే మిరప పంటను సాగు చేశారు అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు అశ్వరావుపేట దమ్మపేట చంద్రుగొండ ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి బూర్గంపాడు దుమ్ముగూడెం చర్ల కొత్తగూడెం మణుగూరు అశ్వాపురం మండలం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పెనుబల్లి కల్లూరు తల్లాడ వైరా నాగులవంచ ముదిగొండ బోనకల్లు మండలం చేశారు మిర్చి పంట సాగు కి ఎకరానికి లక్ష రూపాయలు పైనే పెట్టుబడి అవుతుంది కాగా ఈ ఏడాది సంభవించిన పేథాయ్ తుఫాను కారణంగా మిరప పంటను తెగుళ్లు ఆశించాయి దీంతో వాటి నివారణకు ఐదారుసార్లు పైన పురుగుమందులు చేయవలసి వచ్చింది అంతేకాకుండా ఎరువుల కూడా మూడు నాలుగు సార్లు అధికంగా వినియోగించవలసి వచ్చింది దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడులు మరో 30000 పైననే పెరిగాయి తెగులు కారణంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గింది గత ఏడాది ఎకరానికి 22 నుంచి 23 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది ఈ ఏడాది కేవలం పన్నెండు నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది అంతేకాకుండా గత ఏడాది కింటా ధర 9500 పైనే పలికింది కానీ ఈ ఏడాది 5500 నుంచి 6000 ధర పలుకుతుంది దీనికితోడు మిరపకాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎవరు ముందుకు రావటం లేదు రోజూవారీ కూలీల వేతనం కూడా పెరగటంతో రైతులపై పెను భారం పడింది ఒకవైపు దిగుబడులు రాక మరోవైపు ధరలు లేక సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు
Body:మిర్చి రైతుల కష్టాలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Body:మిర్చి రైతుల కష్టాలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట