ETV Bharat / state

కరీంనగర్​లో 144 సెక్షన్​ అమలు

మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలింగ్​ స్టేషన్ల పరిధిలో రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా పాలనాధికారి కె.శశాంక పేర్కొన్నారు.

Implementation of Section 144 in Karimnagar
కరీంనగర్​లో 144 సెక్షన్​ అమలు
author img

By

Published : Jan 21, 2020, 11:56 AM IST

రేపు జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్​ జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. శశాంక పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా ఉండరాదని.. ఎన్నికల కోసం లాడ్జింగ్​లు, ఇతర కమ్యూనిటీ హాళ్లు తీసుకోరాదని సూచించారు.

ప్రజలు, పార్టీల కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చట్ట పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

కరీంనగర్​లో 144 సెక్షన్​ అమలు

ఇదీ చూడండి : భారత్‌లో పెట్టుబడులకు మొదటి మజిలీ తెలంగాణయే

Intro:
                                                               
రేపు జరుగనున్న మున్సిపాల్ ఎన్నికలకు అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాలుగు కొత్తపెల్లి, చొప్పదండి , హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5.00 గంటలతో ముగిసిందని కరీంనగర్ నగరపాలక సంస్థలో జనవరి 22 న సాయంత్రం 5.00 గంటలలోపు ముగుస్తుందని తెలిపారు. ఓటర్లు కళ్యాణ మండపాల వద్ద ప్రజలు, కార్యకర్తలు గుంపులుగా ఉండరాదని, ఎన్నికల కోసం లాడ్జింగ్ లు, ఇతర కమ్యూనిటి హాల్ లు తీసుకోరాదని సూచించారు. ప్రజలు, పార్టీల కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించాలని ఆయన కోరారు ఎన్నికల పోలింగ్ రోజు , ఆ ముందు రోజు ప్రచారం కోసం ప్రింట్ మీడియాకు ఇచ్చే ప్రకటనలకు సంబంధించి ఎం.సి.ఎం.సి. అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చట్ట పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

Body:ర్Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.