భారత్‌లో పెట్టుబడులకు ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నామని, తెలంగాణ రాష్ట్రమే దీనికి మొదటి మజిలీ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన సోమవారం ట్విటర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
-
From IKEA to OnePlus: Key facts how Telangana is transforming itself as a manufacturing state - https://t.co/QBqs95Dsko https://t.co/yBuOm89LqS
— KTR (@KTRTRS) January 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">From IKEA to OnePlus: Key facts how Telangana is transforming itself as a manufacturing state - https://t.co/QBqs95Dsko https://t.co/yBuOm89LqS
— KTR (@KTRTRS) January 20, 2020From IKEA to OnePlus: Key facts how Telangana is transforming itself as a manufacturing state - https://t.co/QBqs95Dsko https://t.co/yBuOm89LqS
— KTR (@KTRTRS) January 20, 2020
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యంత విలువైన పారిశ్రామిక సంస్థలు అమెరికా తర్వాత హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ సంస్థల ఎమోజీలను ట్విటర్‌కు జత చేశారు.
దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ నేడు పలు పారిశ్రామిక సంస్థల అధిపతులతో భేటీ కానున్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, భాగస్వామ్యాల గురించి చర్చిస్తారు. సదస్సు ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణ పెవిలియన్‌ను కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇక్కడే పారిశ్రామికవేత్తలతో భేటీలు జరుగుతాయి.
ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు