వీవీ ప్యాట్‌లపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని హుజూరాబాద్ ఉపఎన్నిక ( huzurabad by poll) రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి సూచించారు (vv pads and evm moving issue).పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించే క్రమంలో వీవీ ప్యాట్ పనిచేయలేదని... దాని స్థానంలో మరో దానితో పోలింగ్ నిర్వహించామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.... నవంబర్ 2న జరగనున్న లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 21 రౌండ్లలో లెక్కింపు జరగనుందని అన్నారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఎన్నికలు ప్రారంభంకంటే ముందు మాక్‌పోల్ నిర్వహించడం జరుగుతుంది. మెషీన్స్, కనెక్షన్ ఏవిధంగా ఉన్నాయనేది.. ఏజెంట్స్ ముందు పరిశీలిస్తాం. ఆ సందర్భంలో పీఎస్ నంబర్ 200లో ఏమి జరిగిందంటే.. దానికి సంబంధించినటువంటి వీవీప్యాడ్లో సాంకేతికపరమైన సమస్య రావడం వల్ల ఆ వీవీప్యాడ్ను పాడైనట్టుగా నిర్ధారించాం. ఒక వీవీప్యాడ్ గాని, మెషీన్ గాని పాడైనట్టుగా నిర్ధారించినప్పుడు కొత్త మెషీన్‌తో దానిని భర్తీ చేస్తాం. అక్కడున్న వీవీప్యాడ్ పాడైందని తెలియగానే దానిని పక్కకు తీసేసి దాని స్థానంలో రిజర్వ్‌లో ఉన్న వీవీప్యాడ్ను అక్కడ ఏర్పాటు చేశాం. ఈ విషయం తెలుసుకోకుండా ఈ విధంగా ప్రచారం చేయడం, తప్పుదారి పట్టించడం, ఒక వ్యవస్థపై ఒక రకమైన రూమర్స్ క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. - రవీందర్ రెడ్డి, హుజూరాబాద్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి.
ఇదీ చూడండి: Bandi sanjay on huzurabad by poll: 'ఈవీఎంలు మార్చారని అనుమానంగా ఉంది'