ETV Bharat / state

huzurabad by election: నామపత్రాల పరిశీలన పూర్తి.. ​ప్రస్తుతం బరిలో ఎంతమంది ఉన్నారంటే.. - నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి

హుజూరాబాద్​ ఉపఎన్నిక సందర్భంగా అభ్యర్థుల నామపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది(Huzurabad by-election nominations). ఉపఎన్నిక సందర్భంగా 61 మంది అభ్యర్థులు 92 నామపత్రాలు దాఖలు చేశారు. వాటిలో 19 మంది దాఖలు చేసిన 23 నామినేషన్లు తిరష్కరణకు గురైనట్లు రిటర్నింగ్​ అధికారులు వెల్లడించారు.

nominations
nominations
author img

By

Published : Oct 12, 2021, 3:12 AM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​ ఉప ఎన్నిక నామపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని రిటర్నింగ్‌ అధికారి పూర్తి చేశారు(Huzurabad by-election nominations). ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 1 నుంచి 8వరకు అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించారు. అనంతరం ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నామపత్రాల పరిశీలన ప్రక్రియను పకడ్భందీగా నిర్వహించారు. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 నామపత్రాలను దాఖలు చేశారు.

సోమవారం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డి అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలను పరిశీలించారు. ఒకొక్క నామపత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 19 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 23 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు(nominations verification process completed). ఉప ఎన్నికల బరిలో 42 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 13 నామపత్రాల ఉప సంహరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: Case On Etela Rajender: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈటల​పై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.