.
Eetela Rajender Interview: ఎంత మభ్యపెట్టినా గెలిచేది నేనే: ఈటల - హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల
హుజూరాబాద్‌లో అధికార పార్టీ ఎన్నికల ప్రచారం చేయడం లేదని.. ఓటర్లను మభ్యపెట్టే ప్రక్రియను గత నాలుగు నెలలుగా కొనసాగిస్తోందని భాజపా అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆరోపించారు. అధికార పార్టీ తనపై ఎంత అసత్య ప్రచారాన్ని కొనసాగించినా.. కొనుగోళ్ల పర్వానికి తెరలేపినా చివరికి గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత మభ్యపెడుతున్నా తాను ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు చూపెడుతున్న ప్రేమ, అప్యాయత తన విజయం ఖాయమనే ధీమాను గుర్తు చేస్తోందన్నారు. తాను అభివృద్ది చేయలేదని.. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించలేదని అసత్య ప్రచారం చేస్తూ ఓట్లు పొందేందుకు యత్నిస్తున్న వారు గత ఆరు పర్యాయాలుగా ఎలాంటి అభివృద్ది చేయకుండానే గెలిపిస్తున్నారా అంటున్నా ఈటల రాజేందర్‌తో మా ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి..
భాజపా అభ్యర్ధి ఈటల రాజేందర్
.