ETV Bharat / state

'లాక్​డౌన్​ ముగిసినా వ్యాపారం ఎలా ఉంటుందో'

కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ పర్యవసానంగా వ్యాపార వాణిజ్య రంగాలు కుదేలు అవుతున్నాయి. కరీంనగర్‌‌లో దాదాపు 50రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగడం వ్యాపార వర్గానికి కోలుకోలేని దెబ్బతీసింది. లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్న క్రమంలో ప్రభుత్వం వ్యాపార వాణిజ్య రంగాలను మూడు కేటగిరిల్లో వర్గీకరించి షాపులు తెరిచేందుకు అనుమతిస్తోంది. ఏ-కేటగిరిలోని నిత్యావసర వస్తువుల దుకాణాలను పగలంతా తెరిచేందుకు అనుమతిస్తుండగా బీ-కేటగిరిలోని దుకాణాల సరిబేసి సంఖ్య ఆధారంగా వ్యాపారానికి అనుమతిస్తున్నారు. అయితే సీ-కేటగిరిలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లను ఎప్పుడు తెరవాలన్న స్పష్టత లేకపోవడం వల్ల ఆ రంగంపై ఆధారపడిన వర్గాలతో పాటు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

'లాక్​డౌన్​ ముగిసినా వ్యాపారం ఎలా ఉంటుందో'
'లాక్​డౌన్​ ముగిసినా వ్యాపారం ఎలా ఉంటుందో'
author img

By

Published : May 15, 2020, 6:34 AM IST

'లాక్​డౌన్​ ముగిసినా వ్యాపారం ఎలా ఉంటుందో'

కరీంనగర్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రభుత్వం.. వైరస్ మరింత విస్తరించకుండా అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తొలుత వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారం నిమిత్తం వచ్చే వారని హోటళ్లలోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ప్రజలు గుంపులుగా ఒక చోట గుమికూడకుండా ఉండేందుకు రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. దీనితో జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద, మధ్యతరహా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.

క్రమంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు లాక్‌‌డౌన్​ను పెంచుతూ పోయింది. దీనితో ప్రధానంగా సీ-కేటగిరిలోకి వచ్చే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు అందులో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. సాధారణంగా హోటళ్లలో పనిచేసే వారు అధికశాతం ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వారున్నందున హోటళ్లు నడవని కాలంలో వారిని పోషించడం భారంగా మారింది. దీనితో లాక్‌డౌన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్మికులను తమ స్వగ్రామాలకు వెళ్లిపోవాలని సూచించారు. మూడు నెలలపాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన డబ్బును సమకూర్చడం హోటల్ యజమానులకు భారంగా మారింది. అయితే సుదూర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు లాక్‌డౌన్‌ పూర్తి అయ్యాక వస్తారా లేదా అన్న అనుమానం హోటల్ యజమానులను వెంటాడుతోంది.

దాదాపు రెండు నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లు మూసి ఉన్నందున నిర్వహణ పన్నుల చెల్లింపుతో పాటు విద్యుత్ బిల్లులు భారంగా మారాయని చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ కాలంతో ప్రజలంతా ఇంటి భోజనానికి అలవాటు పడటం.. దీనికితోడు హోటల్‌‌లో ఒకరి భోజనం కోసం అయ్యే ఖర్చుతో ఒక కుటుంబం ఖర్చు గడుస్తుందనే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్న ఆందోళన యజమానుల్లో కనిపిస్తోంది. ప్రధానంగా హోటల్‌ పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉండే చెఫ్‌‌లు మళ్లీ అందుబాటులోకి వస్తారా లేదా అన్న అనుమానం వెంటాడుతోందని అంటున్నారు. కొత్తగా వచ్చే మాస్టర్ల వల్ల తమ హోటల్‌‌కు పూర్వకాలంలో గిరాకీ మళ్లీ వస్తుందా..? ప్రజలు పూర్వం వచ్చే విధంగా తమ హోటళ్లకు అప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించడం లేదనే బెంగ యజమానులను వెంటాడుతోంది.

చాలా హోటళ్లకు అద్దె చెల్లించాల్సి పరిస్థితిలో లేమని.. అంతేకాకుండా విద్యుత్ బిల్లు చెల్లింపు కూడా భారంగా మారిందంటున్నారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో వినియోగించిన బిల్లులు మొత్తమే ఇప్పుడు చెల్లించాలటున్నారు. ప్రస్తుతం హోటళ్లు మూతపడి ఉన్న క్రమంలో లక్షల రూపాయల కరెంటు బిల్లులు ఎంత వరకు సాధ్యమౌతుందో ప్రభుత్వమే గమనించాల్సిన అవసరం ఉందని యజమానులు సూచిస్తున్నారు. అంతే కాకుండా హోటళ్లు ప్రారంభించినప్పటికీ భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో టేబుల్​కి ఒకరిని మాత్రమే అనుమతించడం లేదా పార్శిల్‌కు మాత్రమే అనుమతిస్తామనడం ఆందోళన కలిగిస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు.

ఇప్పటికే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న యజమానులు మళ్లీ హోటళ్లు ప్రారంభించిన తర్వాత కూడా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందనే ఆందోళన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 30 లక్షల మందికి ఉపాధితో పాటు ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీలోనూ సింహభాగం హోటల్ రంగం నుంచే చెల్లిస్తోందని యజమానులు అంటున్నారు. ఇప్పటి వరకు సీ- కేటగిరిలో ఉన్న హోటళ్లు రెస్టారెంట్లకు ఎలా అనుమతిస్తారన్న స్పష్టత లేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో హాస్పిటాలిటీ రంగానికి కూడా వెసులుబాటు కల్పించాలని సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారితో కుదేలైన హాస్పిటాలిటీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటేనే నిలదొక్కుకునే అవకాశం ఉందని.. అంతేకాకుండా ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకొనే అవకాశం ఉందని యజమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: వైద్యులు, సామాన్యులకు డబ్ల్యూహెచ్​ఓ 'యాప్​' సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.