హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో ఇంటివద్దకే ఆర్టీసీ కార్గో సేవలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌ఎం జీవన్ ప్రసాద్ వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో 135 మంది అధీకృత డీలర్లు ఉన్నారని తెలిపారు. నగర పరిధిలో ఐదు కిలోమీటర్ల వరకు ఇంటి వద్దకే పార్శిళ్లను చేరవేస్తామని పేర్కొన్నారు.
కార్గో సేవలు ప్రారంభించాక రీజియన్ పరిధిలో రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజు 3లక్షల 60వేల కిలోమీటర్లు బస్సులు తిరుగుతుండగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నడుపుతున్నామని వెల్లడించారు. ఆదాయం రూ.కోటి 5 లక్షల రూపాయలకు పెరిగిందని ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్ పేర్కొన్నారు.