Hindu Ekta Yatra in Karimnagar : కరీంనగర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా.. బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్రను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన యాత్రలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణం కాషాయమయంగా మారింది. ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలు, తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు.
హిందూ సమాజ శక్తి చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. ఒక్క రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవకపోతే ఏం అవుతుందని.. 15 రాష్టాల్లో అధికారంలో ఉన్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలో హిందూ ధర్మం ఆగిపోయిందని వివరించారు. ఏక్తా యాత్ర హిందువులను ఏకం చేస్తుందని పేర్కొన్నారు ఈక్రమంలోనే హిందువులంతా ఏకం కావాలని అన్నారు. కర్ణాటకలో ఓడిపోతే హిందుత్వం లేకుండా పోతుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
హిందుత్వం లేకుంటే భారత దేశమే ఉండేది కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒకప్పుడు హిందువు అంటే అందరికి బంధువని.. ఇప్పుడు అన్ని బంద్ అనే పరిస్థితి నెలకొందని అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం ఎలాగైతే హిందువులను ఏకం చేసిందో.. ఇప్పుడు ఏక్తా యాత్ర అదే గుర్తు చేస్తోందని బండి సంజయ్ వివరించారు.
తెలంగాణలో త్వరలో రామరాజ్యం రానుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తెస్తామని వివరించారు. అసోంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నామని.. కానీ తెలంగాణలో మాత్రం జీతాలు ఎప్పుడిస్తారో తెలియట్లేదని ఆరోపించారు. దేశాన్ని విశ్వ గురు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందిని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.
"ఏక్తా యాత్ర హిందువులను ఏకం చేస్తుంది. హిందువులంతా ఏకం కావాలి. కర్ణాటకలో ఓడిపోతే హిందుత్వం లేకుండా పోతుందా. హిందుత్వం లేకుంటే భారతదేశమే ఉండేది కాదు. ఒక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతే ఏమైంది.. ఇంకా 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. కర్ణాటకలో మొత్తం హిందూ ధర్మం ఓడిపోయింది. తెలంగాణలో కచ్చితంగా హిందూ ధర్మం ఉంటుంది." - బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
"అసోంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అనేవి వేస్తున్నాం. మరి తెలంగాణలో 10వ తేదీన వేస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు వీఆర్ఎస్కు ఇస్తారని విశ్వసిస్తున్నాను." - హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
ఇవీ చదవండి :