ETV Bharat / state

కరీంనగర్​ సీపీ సహా ముగ్గురు పోలీస్ అధికారులకు జైలుశిక్ష - కరీంనగర్​ సీపీ సహా ముగ్గురికి జైలు శిక్ష, జరిమానా

కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సహా ముగ్గురికి... హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసి తన రిసార్టులోకి వెళ్లి వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టు తీర్పు వెల్లడించింది.

కరీంనగర్​ సీపీ సహా ముగ్గురికి జైలు శిక్ష, జరిమానా
author img

By

Published : Sep 27, 2019, 11:21 PM IST

Updated : Sep 27, 2019, 11:46 PM IST

కరీంనగర్​ సీపీ కమలాసన్​ రెడ్డితోపాటు ముగ్గురికి కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆరు నెలల జైలు శిక్ష, 12వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తీగలగుట్టపల్లిలోని పుష్పాంజలి రిసార్ట్స్​లో పేకాట అడుతున్నారని గతంలో పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా...12 కార్డులతో రమ్మీ ఆడటం నేరం కాదని.. దానిపై బెట్టింగ్ చేయడం మాత్రమే నేరమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రిసార్ట్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించిన హైకోర్టు.. వాటిని పరిశీలించి బెట్టింగ్ జరిగినట్లు రుజువైతేనే సోదాలు చేయాలని పోలీసులను 2015లో ఆదేశించింది. అనుమానాలతో రిసార్ట్స్​లో ప్రవేశించి వేధించొద్దని స్పష్టం చేసింది.

న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు అక్రమంగా ప్రవేశించి వేధిస్తున్నారని రిసార్టు యజమాని, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు తీర్పు వెల్లడించింది. సీపీ కమలాసన్ రెడ్డితోపాటు ఆ సమయంలో కరీంనగర్​లో పనిచేసిన ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్​హెచ్​వో శశిధర్ రెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును నాలుగు వారాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరీంనగర్​ సీపీ సహా ముగ్గురు పోలీస్ అధికారులకు జైలుశిక్ష

ఇదీ చూడండి: పురపాలక ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా...

File : TG_Hyd_76_24_Polling_Stations_Dry_3053262 From : Raghu Vardhan ( ) రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీలు, సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది గ్రామపంచాయతీల్లోని అన్ని పదవులతో పాటు 24 సర్పంచులు, 375 వార్డు సభ్యులు సహా ఒక ఎంపీటీసీ ఖాళీగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ లో భాగంగా అక్టోబర్ ఐదో తేదీన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ముసాయిదాపై 11వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. పదో తేదీన రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. అభ్యంతరాలు, వినతులన్నింటినీ పరిష్కరించి 19వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితాను కలెక్టర్ ఆమోదించాల్సి ఉంటుంది. అక్టోబర్ 19వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు.
Last Updated : Sep 27, 2019, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.