ETV Bharat / state

Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting : 'బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాకే' - హుస్నాబాద్ బహిరంగ సభపై హరీశ్‌రావు

Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting : ఈ నెల 15న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎవరెన్ని జిమిక్కులు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కార్యకర్తలపై నమ్మకంతోనే కేసీఆర్ తొలి ఎన్నికల సభ ఇక్కడ పెడుతున్నారని తెలిపారు. 2018లో సీఎం హుస్నాబాద్‌లోనే ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రారంభించి విజయ ఢంకా మోగించారని మంత్రి గుర్తుచేశారు.

Harish Rao on Husnabad Public Meeting
Harish Rao
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 4:57 PM IST

Updated : Oct 10, 2023, 6:15 PM IST

Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాకే

Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting : తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) అన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ.. ఈరోజు దక్షిణ భారతదేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అయిందని పేర్కొన్నారు. ఈ నెల 15 న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో(BRS Manifesto 2023) వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి వివరించారు. హుస్నాబాద్‌లో కార్యకర్తలపై నమ్మకంతో కేసీఆర్ తొలి ఎన్నికల సభ పెడుతున్నారని తెలిపారు.

Harish Rao on Husnabad Public Meeting : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామ శివారులో ఈనెల 15న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) బహిరంగ సభ స్థలాన్ని మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు(Congress Leaders) గోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Harish Rao Counter to Congress Guarantees : 'కాంగ్రెస్‌ హామీలు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది'

Harish Rao Fires on Congress : కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు దిల్లీలో ఎక్కువ.. గల్లీలో తక్కువ ఉంటారని విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌కు ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తామని బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. తర్వాత తెలంగాణ ఇవ్వకుండా బీఆర్ఎస్‌ పార్టీని మింగేయాలని చూసిందని ఫైర్ అయ్యారు.

'హుస్నాబాద్‌లో కార్యకర్తలపై నమ్మకంతో కేసీఆర్ తొలి ఎన్నికల సభ పెడుతున్నారు. సీఎం కేసీఆర్‌.. గౌరవెల్లి ప్రాజెక్టును హుస్నాబాద్‌కు ఇచ్చిన గొప్పవరం. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఈరోజు దక్షిణ భారతదేశ ధాన్య బండాగారంగా మారింది. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం నంబర్ వన్ అయింది. ఈ నెల 15 న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్‌ నేతలు దిల్లీలో ఎక్కువ.. గల్లీలో తక్కువ ఉంటారు.' -హరీశ్​రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

Harish Rao Comments on BJP Congress : మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్(Telangana), బీజేపీ నేతలు(BJP Leaders) మంచివారో.. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మంచివారో రైతులు ఆలోచించుకోవాలని మంత్రి కోరారు. హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారని స్పష్టం చేశారు. ఎవరెన్ని జిమిక్కులు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 15వ తేదీ హుస్నాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ(First Election Campaign Public Meeting)లో పాల్గొననున్నారు. అయితే సీఎం 2018లో ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రారంభించి విజయ ఢంకా మోగించారు.

Harish Rao Speech at BRS Public Meeting : 'కేసీఆర్ దెబ్బకు బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్ రనౌట్.. బీఆర్‌ఎస్‌ సెంచరీ'

Harish Rao Comments on Congress : జాకీ పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు: మంత్రి హరీశ్​రావు

Last Updated : Oct 10, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.