ETV Bharat / state

Harish rao comments on bjp: రైతులను కార్లతో తొక్కించి చంపే వాళ్లకు ఓటేస్తారా? - కరీంనగర్ జిల్లా వార్తలు

ఈటల రాజేందర్‌(eetela rajendar) ఆరుసార్లు గెలిచి కూడా ఏం చేయలేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పాతర్లపల్లిలో నిర్వహించిన రోడ్​షోలో పాల్గొన్న మంత్రి... పనిచేసే మనసున్న వ్యక్తినే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

Harish rao comments on bjp, huzurabad by election 2021
భాజపాపై మంత్రి హరీశ్ రావు ఆరోపణలు, హుజూరాబాద్ ఉపఎన్నికలు
author img

By

Published : Oct 9, 2021, 4:43 PM IST

భాజపా(bjp) పాలనలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని మంత్రి హరీశ్‌రావు(Harish rao comments on bjp) అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పాల్గొన్న మంత్రి... పాతర్లపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్‌(eetela rajendar) ఆరుసార్లు గెలిచి కూడా ఏం చేయలేదని విమర్శించారు. పనిచేసే మనసున్న వ్యక్తినే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. 'పెంచెటోళ్లు వాళ్లు... పంచేటోళ్లం మేము' అని అన్నారు. ఈటల రాజేందర్ 60 మందితో నామినేషన్లు వేయించారని ఆరోపించారు.

వాటితో బతుకుతామా?

భాజపా ఏవేవో పంచుతోందని ఆరోపించారు. వాటితో బతుకుతామా? అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు రోడ్డెక్కితే... కార్లు ఎక్కించి చంపుతోందని(Harish rao comments on bjp) ఆరోపించారు. డీజిల్ ధరలు పెంచుతూ... రైతుల ఉసురు పోసుకుంటోందని విమర్శించారు. రైతులను ఉగ్రవాదులుగా పోల్చిన భాజపా... ఎరువుల ధరలు పెంచాలని ఆలోచిస్తోందని ఆరోపించారు. ఏం చేసిందని భాజపాకు ఓటేయాలని ప్రశ్నించారు.

రూపాయి అయినా ఇచ్చారా?

ఎస్సీల అభివృద్ధి కోసం దళిత బంధును సీఎం కేసీఆర్(cm kcr dalitha bandhu) తీసుకొచ్చారని తెలిపారు. కల్యాణ లక్ష్మిని ముందుగా దళితులకే ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత అన్ని కులాలకు వర్తింపజేశారని పేర్కొన్నారు. సొంత స్థలంలో ఇళ్లు కట్టేందుకు రూ.5లక్షలు ఇస్తామని సీఎం అసెంబ్లీలో శుక్రవారం చెప్పారని తెలిపారు. ఎంపీగా సంజయ్ గెలిచి రెండున్నరేళ్లు అయిందని... పాతర్లపల్లిలో రూపాయి అయినా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు.

ఒక్క అవకాశం

ఈటల రాజేందర్ 60 మందితో నామినేషన్లు వేయించారని ఆరోపించారు. 'పెంచెటోళ్లు వాళ్లు.... పంచేటోళ్లం మేం' అని మంత్రి అన్నారు. గెల్లు శ్రీనివాస్​ యాదవ్​కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కారు గుర్తు కనబడకపోతే.. అడిగి మరీ ఓటేయాలని కోరారు.

ఈటల రాజీనామాతో ఎన్నిక అనివార్యం

రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్​ నియోజకవర్గం(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక వచ్చింది. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఇటు అధికార తెరాస, అటు భాజపా ప్రచారాల(Huzurabad By Election Campaign 2021)తో హోరెత్తుతోంది. ఇప్పటికే తెరాస మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉండి.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్నారు. రోజుకో వర్గానికి సంబంధించి ఆత్మీయ, సమ్మేళన సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో తెరాసపై పాజిటివ్ టాక్ తీసుకొస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్

ఉపఎన్నిక వివరాలిలా...

ఈ నెల 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలిపింది.

ఇదీ చదవండి: Huzurabad By Election 2021: హుజూరాబాద్​లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.