కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులను సింహావాహనంపై ఊరేగించారు. భక్తుల గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇవీ చూడండి : ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు