ఇస్రో (ISRO)నిర్వహించనున్న వెబినార్ శిక్షణ సదస్సుకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 1 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే వెబ్‌నార్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం-వాటి అనువర్తనాలు ప్రకృతి వైపరిత్యాలు, పర్యావరణం తదితర అంశాలపై శిక్షణ అందిస్తారు.
ఇస్రో శిక్షణ సంస్థ నిర్వాహకుడు, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ హరీశ్ చంద్ర మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు షరీఫ్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సదస్సుకు ఎంపిక కావడంపై షరీఫ్ అహ్మద్‌ను పలువురు అభినందించారు.