ETV Bharat / state

రైతుల కోసమే.. వ్యవసాయ ప్రణాళిక : మంత్రి గంగుల కమలాకర్​ - నియంత్రిత సాగు విధానం

బంగారు తెలంగాణలో రైతుల  సంక్షేమం కోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని చూస్తుందని.. రైతులంతా ముఖ్యమంత్రి చెప్పినట్టు వింటే.. లాభాలు అర్జిస్తారని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​ ఆడిటోరియంలో జరిగిన మానకొండూర్​ నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సమగ్ర ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Government Preparing Crop Plan For Formers Safety
రైతుల కోసమే.. వ్యవసాయ ప్రణాళిక : మంత్రి గంగుల కమలాకర్​
author img

By

Published : May 28, 2020, 2:04 PM IST

కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​ ఆడిటోరియంలో జరిగిన మానకొండూర్​ నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సమగ్ర ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి గంగుల కమాలకర్​ పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు, సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, రైతులంతా ముఖ్యమంత్రి చెప్పినట్టు నియంత్రిత సాగు విధానంలో పంట వేయాలని మంత్రి సూచించారు. రైతును రాజును చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ పంట కార్యక్రమం రూపొందించిందని మంత్రి అన్నారు. నియంత్రిత సాగు విధానం వల్ల రైతులకు చేకూరే లాభాలను వివరించారు.

రైతులు సాగు చేయాల్సిన పంటలు, మార్కెట్లో డిమాండ్​, పంట సాగులో పాటించాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు, అధికారులకు వివరించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నిత్యం ఆలోచిస్తున్నారని, అందుకే.. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, ఉచిత కరెంటు ఇస్తున్నామని అన్నారు. రైతుల క్షేమం కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రపంచస్థాయిలో మార్కెట్​ ఉన్న పొడవు, సన్న పంటలైన వరి, పత్తి, కంది పంటలు పండించాలని సూచించారు.

ఇదీ చూడండి: మండుతున్న ఎండలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.