కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ వద్ద నిరాటంకంగా గోదావరి జలాల ఎత్తిపోతలు సాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా సుమారు 9 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లో ఆరు బాహుబలి పంపుసెట్లు నిరాటంకంగా పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు రాత్రిపగలు పర్యవేక్షణ చేపట్టారు. ఈ నెల 14న మొదలైన భారీ ఎత్తిపోతలతో శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి గోదావరి నది జలాలు చేరుతున్నాయి.
ఇదీ చూడండి : వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్హెచ్ఆర్సీ విముక్తి