ETV Bharat / state

'సుప్రీం తీర్పు ఆదివాసీలకు శరాఘాతమే.. పునఃసమీక్షించాలి' - SUPREME COURT

కరోనా వైరస్ వ్యాప్తిని సాకుగా చూపిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదీవాసీల హక్కులను కాలరాసిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో జీవో నంబర్ 3ని రద్దు చేసి అడవి బిడ్డల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తీర్పును పునసమీక్షించాలని...ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

'వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి'
'వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి'
author img

By

Published : May 2, 2020, 11:24 PM IST

కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్న తరుణంలో బయటికి ఎవరూ వెళ్ళకుండా సుప్రీంకోర్టు జీవో నంబర్ 3ని రద్దు చేసింది. ఈ సంచలన తీర్పుని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎడ్యుకేషన్ ఎంప్లాయిమెంట్ కల్చర్ ఎడిషన్ ఫారెస్ట్ రైట్స్ పూర్తిగా ప్రమాదంలో పడుతున్నాయని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ తీర్పును సుప్రీం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యానికి అత్యంత దూరంగా ఉన్న ఆదివాసీలు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచాన్ని చూస్తున్న తరుణంలో పూర్తి ఏజెన్సీలో రిజర్వేషన్ ఎత్తివేస్తూ 50 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం తీర్పునివ్వడం ఆందోళనకరమన్నారు.

అదివాసీ చట్టాలకు గండి...

ఆదివాసీ చట్టాలపై అవగాహన లేకుండా అగ్రకులాలకు చెందిన న్యాయమూర్తులు ఇలాంటి తీర్పు ఇవ్వడం ఆదివాసీ చట్టాలకు గండి కొట్టడమేన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆదివాసీ సమాజం మొత్తం జాతి నుంచి ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేల ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి : దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.