ETV Bharat / state

తాటి చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి - Karimnagar District Latest News

ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సోమారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Gita karmikudu accidentally fell from a palm tree and died
తాటి చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడు మృతి
author img

By

Published : Mar 3, 2021, 4:42 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. పెరుమండ్ల రమేష్ (42) అనే వ్యక్తి చెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే ఆనారోగ్యంతో మూడు లక్షల వరకు ఖర్చయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉన్న ఆస్తులు అమ్మి హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించరాని పేర్కొన్నారు.

ఆడపిల్లల రోదనలు..

కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. భార్య, ఇద్దరు ఆడపిల్లల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.