కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నాలుగు బాహుబలి పంపుసెట్లతో 12,600 క్యూసెక్కుల గోదావరి నదీ జలాలను ఎత్తిపోస్తున్నారు.
ఈ నెల 17న పునః ప్రారంభించగా... సుమారు 10 టీఎంసీల వరకు ఎత్తిపోయనున్నారు. రోజూ ఒక టీఎంసీకి పైగా నీటిని ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.
ఇదీ చదవండి: నేతాజీ జీవితం యువతకు ఆదర్శం: కిషన్ రెడ్డి