ETV Bharat / state

Gangula kamalakar Vs Bandi Sanjay in Karimnagar : ఊహాగానాలకు తెర.. కరీంనగర్‌లో గంగుల వర్సెస్ బండి సంజయ్.. ఇది ఫిక్స్..!! - గంగుల కమలాకర్‌ ఆస్తుల వివాదం తాజా అప్‌డేట్స్

Gangula kamalakar Vs Bandi Sanjay in Karimnagar : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ప్రకటించడంతో.. ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి గంగుల కమలాకర్‌ ఆస్తుల కేసులో.. సంజయ్‌ శుక్రవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఇన్నాళ్లుగా శాసనసభకు పోటీ చేయడానికి మొగ్గు చూపని బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌.. మనసు మార్చుకోవడంతో.. పరిస్థితులు రసవత్తరంగా మారాయి.

Karimnagar Politics
TS Assembly Elections Heat in Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 10:33 AM IST

Gangula kamalakar Vs Bandi Sanjay in Karimnagar ఊహాగానాలకు తెర.. కరీంనగర్‌లో గంగుల వర్సెస్ బండి సంజయ్.. ఇది ఫిక్స్..

Gangula kamalakar Vs Bandi Sanjay in Karimnagar : భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అసెంబ్లీకి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై ఉత్కంఠకు తెరపడింది. గత కొన్ని నెలలుగా కరీంనగర్ అసెంబ్లీ బరి నుంచి బండి సంజయ్ పోటీ చేయడం లేదని వార్తలు వెలువడ్డాయి. మళ్లీ పార్లమెంట్ స్థానానికే పోటీ చేస్తానని సంజయ్‌ చెబుతూ వచ్చారు.

కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్‌(Minister Gangula Kamalakar)ను ఎదుర్కొనే బీజేపీ అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 3 పర్యాయాలు గెలుపొందిన గంగుల కమలాకర్‌కు పోటీ ఎవరన్న అంశంపై గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్మెడ లక్ష్మీ నర్సింహరావు, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ గట్టి పోటీ ఇచ్చారు.

Political Heat In Karimnagar : అయితే చల్మెడ లక్ష్మీ నర్సింహరావును వేములవాడ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు పోటీ చేయడానికి బండి సంజయ్‌ ఆసక్తి చూపకపోవడంతో అయోమయం నెలకొంది. అంతకుముందు బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ పార్టీ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో బండి సంజయ్(Bandi Sanjay) కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం లేదంటూ చేసిన కామెంట్స్‌ సైతం తీవ్ర చర్చకు దారితీశాయి.

Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది​'

Bandi Sanjay Vs Gangula kamalakar : ఈ నేపథ్యంలోనే తాను అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలా అనే విషయంలో బండి సంజయ్ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారు. కరీంనగర్‌లోని మెజార్టీ కార్యకర్తలు బండి సంజయ్‌ని అసెంబ్లీ(Karimnagar Assembly Constituency)కి పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా బండి సంజయ్‌కు బదులు.. కరీంనగర్‌లో ఎవరు పోటీ చేసినా పెద్దగా ప్రభావం ఉండదనే అభిప్రాయం వెలిబుచ్చారు. దాంతో కరీంనగర్ జిల్లాలో అంతటా తన ప్రభావం ఉండాలంటే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడమే సరైనదనే నిర్ణయానికి వచ్చారు బండి సంజయ్‌. ఈ మేరకే వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తాను కరీంనగర్ అసెంబ్లీ బరిలో ఉంటానని ప్రకటించారు. అంతేకాకుండా గంగుల కమలాకర్‌ ఆస్తుల కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టుకూ హాజరయ్యారు.

BJP Leaders Nirasana Deeksha in Hyderabad : 'కేసీఆర్​కు జమిలి ఎన్నికలు అంటే భయం పట్టుకుంది'

అయితే సంజయ్ ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్‌తో బండి సంజయ్ కుమ్మక్కయ్యారన్న వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపించాయి. గంగులతో కుమ్మక్కు కావడంతోనే కరీంనగర్ బరి నుంచి బండి సంజయ్ తప్పుకున్నారని.. గంగుల ఆస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరుకావడం లేదంటూ చర్చ జరిగింది.

ఈ ఊహాగానాలకు చెక్‌ పెడుతూ కోర్టు ఆదేశంతో సైనిక నిధికి రూ.50 వేలు చెల్లించి మరీ శుక్రవారం గంగుల ఆస్తుల కేసుకు సంబంధించి విచారణకు హాజరై వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని.. బీఆర్ఎస్ అరాచకాలపై గట్టిగానే పోరాడతానని బండి సంజయ్ ప్రకటించడంతో స్థానిక క్యాడర్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Bandi Sanjay Interesting Comments on Assembly Elections 2023 : 'ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.