తిరుమల శ్రీవారిని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో... వెంకటేశుడి సేవలో పాల్గొన్నారు. జనవరి 25 నుంచి కరీంనగర్‌లోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ఏటా తితిదే సహకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. లడ్డూలు, శేష వస్త్రం పంపించాలని ఈవోను కోరినట్లు గంగుల తెలిపారు.
ఇవీ చూడండి:'మహిళలకు డయల్ 100పై అవగాహన అవసరం'