యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తిసినా.. సీఎం కేసీఆర్ 3 వేల కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు దిగినా.... మోదీ సర్కార్ మనసు కరగలేదని విమర్శించారు. సర్కారు మెడలు వంచామంటున్న భాజపా, కాంగ్రెస్ వ్యాఖ్యల్ని ఎద్దేవా చేసిన గంగుల...అన్నదాతల సంక్షేమంలో కేసీఆర్ ముందుంటారని స్పష్టంచేశారు.
ధాన్యం సేకరణకు రూ.14 వేల నుంచి రూ.15 వేల కోట్లు అవసరమని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూచికత్తు అడుగుతున్నామన్నారు. రా రైస్ ఎంత తీసుకుంటారో కేంద్రాన్ని అడుగుతామని స్పష్టం చేశారు. యాసంగి ధ్యానం రా రైస్ చేస్తే క్వింటాకు రూ.300 నష్టం వస్తుందని తెలిపారు. అవసరానికి తగ్గట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై మంత్రి గంగుల కమలాకర్‌తో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి.
ప్రభుత్వం మొత్తం ధర్నా చేసినా కేంద్రం మనసు కరగలేదు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తిసింది. భాజపా, కాంగ్రెస్ ఎవరి మెడలు వంచాయి? పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు భాజపా ధర్నాలు చేయాలి. రూ.3 వేల కోట్లతో రైతులను సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. ధాన్యం సేకరణకు 13 నుంచి 14 కోట్ల గన్ని బ్యాగులు అవసరం. గన్ని బ్యాగులు కేంద్రం ఇస్తుందో..? లేదో..? చూస్తాం. ప్రస్తుతం రాష్ట్రం వద్ద కోటి 20 లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయి. మరో నాలుగైదు కోట్ల గన్ని బ్యాగులు సమకూర్చుకుంటాం.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
ఇదీ చూడండి: