Gangula Kamalakar Attended CBI Investigation: దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో విచారణలో భాగంగా నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎదుట మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఖమ్మంలో జరిగిన కాపు సంఘం సమావేశంలో శ్రీనివాస్‌తో ఫోటో దిగానని గంగుల పేర్కొన్నారు. ఆ ఫొటోల ఆధారంగానే సీబీఐ పిలిచినట్లు భావిస్తున్నామన్నారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర అన్నారు. వ్యక్తిగతంగా శ్రీనివాస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించారు.
శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలు.. ఇరువురి మధ్య జరిగిన లావాదేవీలపై సీబీఐ విచారించనుంది. ఏయే విషయాలు చర్చించారు? ఎవరెవరితో మాట్లాడారు? శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో ఉన్న సంబంధాలపై గంగుల కమలాకర్, రవిచంద్ర నుంచి వాగ్మూలం నమోదు చేయనున్నారు. నకిలీ సీబీఐ అధికారి ముసుగులో డబ్బు ఎరచూపి శ్రీనివాస్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రలోభ పెడుతున్నట్లు గుర్తించిన... దర్యాప్తు సంస్థ గత శనివారం దిల్లీలోని తమిళనాడు భవన్‌లో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది. గ్రానైట్ కుంభకోణంలో తనకు ఉన్న పరిచయాల ద్వారా కేసులో ఉపశమనం వచ్చేలా చేయడానికి శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: