ETV Bharat / state

బ్లాక్​లో రెమ్​​డెసివిర్ ఇంజక్షన్​ను విక్రయిస్తోన్న ముఠా అరెస్ట్​ - బ్లాక్​లో కొవిడ్ వ్యాక్సిన్

కొవిడ్​ సెకండ్ వేవ్ నేపథ్యంలో రెమ్​డెసివిర్ ఇంజక్షన్లకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. వారం రోజులుగా ఇంజక్షన్లకు కొరత ఏర్పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కరీంనగర్​లో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. జిల్లాకు చెందిన నలుగురు ఓ ముఠాగా ఏర్పడి.. రెమ్​డెసివిర్​​ను అధిక ధరకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు.

remdesivir injection in block market
remdesivir injection in block market
author img

By

Published : Apr 23, 2021, 5:55 PM IST

రాష్ట్రంలో ఓ వైపు కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంటే.. మరోవైపు చికిత్సలో వాడే ఇంజక్షన్లలో​ కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్​లో విక్రయిస్తున్నారన్న విషయం సంచలనం రేపుతోంది. రెమ్​డెసివిర్​​ను బ్లాక్​లో అధిక ధరకు అమ్ముతూ ప్రజల సొమ్ము కాజేస్తోన్న ఓ ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 18 ఇంజెక్షన్లతో పాటు రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు

జిల్లాకు చెందిన దాసరి సురేశ్​, సత్యనారాయణ, వెంకటసాయి, వరంగల్​కు చెందిన నరేశ్​లు.. ఓ ముఠాగా ఏర్పడి రెమ్​డెసివిర్​​ ఇంజక్షన్​ను రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. కృత్రిమ కొరత సృష్టించి, దందా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కమల్​హాసన్​ రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.