మూడు అడుగుల గణపతి ప్రతిమలను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టడం వల్ల ఆ మేరకే భక్తులు ప్రతిమలను తరలించారు. కరీంనగర్ శివారులోని రేకుర్తి వద్ద శివ థియేటర్ సమీపంలోని విగ్రహాల తయారీ కేంద్రాల నుంచి భక్తులు ఆటోల ద్వారా తమ గణపతులను ఇళ్లకు తీసుకెళ్లారు. పెద్ద ప్రతిమలను తీసుకెళ్లకుండా తయారీ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద విగ్రహాలను విక్రయించకూడదని నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు.
కరోనాకు ముందు తయారు చేసిన పెద్ద విగ్రహాల అమ్మకాలు నిలిచిపోవడం వల్ల భారీగా నష్టపోయామని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు అడుగుల వినాయకుల విగ్రహాలు ఎక్కువగా తయారు చేయకపోవడం వల్ల విక్రయాలు నిలిచిపోయాయన్నారు.
ఇవీ చూడండి: గణాధిపతికి ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి