కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా సాగుతోంది. తొలిరోజు సారలమ్మ, పగడిద్ద, గోవిందరాజులు తమ స్థానాలకు చేరుకోగా విశిష్ట జనవాహిని మధ్య రెండో రోజు సమ్మక్కను ఊరేగింపుగా తీసుకువచ్చి కోయరాజులు గద్దెల మీద ప్రతిష్టించారు.
పొర్లు దండాలతో అమ్మవార్లకు స్వాగతం
అమ్మవార్ల రాకతో భక్తులు తండోపతండాలుగా ఎదురు వస్తూ పొర్లుదండాలతో స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో గుట్టలు, చెట్లతో మానేరు నదిని అనుకొని ఉండటం మినీ మేడారాన్ని తలపించింది. భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థాలాల్లో సేద తీరారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకరపట్నం, బెజ్జంకి మండలంలోని వడ్లూరు, దేవక్కపల్లి, తోటపల్లి, గుండారంలోకి వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు, విద్యుత్ దీపాలు, స్నాన వాటికలు వివిధ సదుపాయాలు కల్పించారు.
ఇదీ చూడండి : శరీరంపై పెయింటింగ్ వేసుకుని ప్రచారం