ETV Bharat / state

కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు: భాజపా

author img

By

Published : Dec 31, 2020, 5:55 PM IST

ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ చాలా మంచిదని ప్రకటించిన కేసీఆర్..‌ నేటికి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతిపై ముఖ్యమంత్రి పట్టింపులేదని విమర్శించారు.

former minister peddi reddy fire on cm kcr in karimnagar
కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు: భాజపా

రాష్ట్ర ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టింపులేదని భాజపా రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని భాజపా పార్టీ కార్యాలయంలో స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. కరోనాతో అనేక మంది నిరుపేదలు చాలా ఇబ్బందులు పడ్డారని.. ఆయుష్మాన్‌ భారత్‌ రాష్ట్రంలో అమలు చేస్తే వారికి ఎంత ఉపయోగంగా ఉండేదన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ చాలా మంచిదని ప్రకటించిన కేసీఆర్‌ నేటికి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదన్నారు.

కరోనా బారిన పడి చాలా మంది ఆస్తులు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా పట్టణాల్లో, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఒక్కటైనా చూపాలని సవాల్​ విసిరారు. రైతు సంక్షేమం, లాభసాటి వ్యవసాయం కోసమే కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేయించిన సీఎం.. ఇప్పుడు అవే చట్టాలను సమర్థిస్తున్నారని అన్నారు. ఏడేళ్లలో ఎంతమందికి రెండు పడకల గదులను ఇచ్చి.. గృహాప్రవేశాలను చేయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ మీద రూ.1.50 లక్షల కోట్లు వసూలు చేయాలని చూసిందని ఆరోపించారు.

ఇదీ చదవండి: సాగుభూముల సందిగ్ధతలకు రెండు నెలల్లో పరిష్కారం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.