కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లికి చెందిన రైతు మావురం మల్లికార్జున్ రెడ్డి ప్రతిష్ఠాత్మక జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అవార్డు పొందారు. సమీకృత పంటల సాగులో మంచి ఫలితాలు సాధించినందుకు గాను ఆయనను గుర్తించి ఐకార్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దిల్లీలో నిర్వహించిన పూసా కృషి విజ్ఞాన మేళాలో... కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు.
జాతీయ స్థాయిలో 35 మంది రైతులను ఈ అవార్డు వరించగా... వారిలో తెలంగాణ నుంచి మావురం మల్లికార్జున్ రెడ్డి ఒక్కరే ఎంపికవడం విశేషం. మేళాలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది రైతులను కలిసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి కొత్త సాగు పద్దతులను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం