కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టు దుద్దెనపల్లిలో గ్రానైట్ బండరాళ్లతో వెళ్తున్న ఓ లారీ అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు లారీ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ... ఫలితం దక్కలేదు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
చేసేదేం లేక డ్రైవర్ ప్రాణాలు కాపాడుకునేందుకు లారీలోంచి బయటకు దూకేశాడు. అప్పటికే మంటలు చెలరేగి లారీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ ఆనవాలు లేకుండా పూర్తిగా కాలి బూడిదయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'