కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. దొడ్డు వడ్లు కొనబోమని కేంద్రంలోని భాజపా చెబుతోందని హరీశ్‌రావు హరీశ్ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచినందుకు భాజపాకు ఓటేయాలా? అంటూ నిలదీశారు. ప్రజలకు మంచి చేసే తెరాసను గెలిపించాలని ప్రజలను కోరారు.
తెరాస ప్రభుత్వ అంటే సంక్షేమానికి మారు పేరు. సీఎం కేసీఆర్ సంక్షేమ యుగం తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే.. ప్రభుత్వ ఒక్క రూపాయి అన్న ఇచ్చేదా.. కానీ ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నాం
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి: Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం