ETV Bharat / state

Congress protest in huzurabad: ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ఆందోళన.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం - పోలీసులతో వాగ్వాదం

Congress protest in huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్​ఎస్​యూఐ నాయకుల అరెస్టును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Congress protest in huzurabad
ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ఆందోళన
author img

By

Published : May 2, 2022, 6:28 PM IST

Congress protest in huzurabad: కాంగ్రెస్ నాయకుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఓయూలో ఎన్​ఎస్​యూఐ నాయకుల అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

ఉస్మానియా వర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెరాస కండువా వేసుకున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది.

హుజూరాబాద్​లో ఉద్రిక్తత.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం

ఇవీ చూడండి: కాంగ్రెస్​ దరఖాస్తును పరిశీలించాలని ఓయూ అధికారులకు హైకోర్టు ఆదేశం

'పది' పరీక్షల్లో మాస్​ కాపీయింగ్​.. టీచర్ల ఫోన్లలో ఆన్సర్స్..

గుడ్​న్యూస్.. భానుడి భగభగల నుంచి కాస్త రిలీఫ్​.. మంగళవారమే మొదలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.