కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు మండలాలకు చెందిన రైతులు రాస్తారోకో చేశారు. శాశ్వత సాగునీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దం క్రితం మొదలుపెట్టిన ఎల్లంపల్లి నీటి పారకం బ్రిడ్జి నిర్మాణాన్ని పాలకులు మరిచారని విమర్శించారు. వరద కాలువ నుంచి తూముల నిర్మాణాన్ని కూడా చేపట్టలేదని, కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ గ్రావిటీ కాలువ నుంచి కూడా నీటి పంపిణీ చేపట్టడం లేదని వాపోయారు. గంట సేపు రాస్తారోకో చేయటం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. మండుటెండలో రైతులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: 'పార్టీలు మారే సంస్కృతి కొత్తేం కాదు'