కొనుగోలులో కోత విధిస్తున్నారంటూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాకు 5 కిలోల కోత ఒప్పుకుంటేనే తూకం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో జరిగిందీ ఘటన.
నిర్వాహకుల తీరును వ్యతిరేకిస్తూ.. రైతులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్, ఏవోలు.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. రామడుగు మండలంలోని వెదిర, పంది కుంటపల్లి, షానగర్, కోరిటపల్లి, దేశ రాజుపల్లి తదితర గ్రామాల రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రజా రవాణాపై కరోనా ప్రభావం.. వైరస్‌కు బలవుతున్న ఉద్యోగులు