ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి - karimnagar district news

ట్రాక్టర్​ బోల్తాపడిన ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన కరీంనగర్​ జిల్లా రుక్మాపూర్​లో చోటుచేసుకుంది. డ్రైవర్​ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

farmer died in karimnagar district
ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
author img

By

Published : May 28, 2020, 8:48 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్​లో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో రైతు ముద్దసాని రాజయ్య మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్​లో డ్రైవర్​తో పాటు బయలు దేరాడు. డీ-89 కాలువ సమీపంలో ట్రాలీ బోల్తాకు గురై రైతు ముద్దసాని రాజయ్యపై పడింది. ఈ ప్రమాదంలో రైతు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్టు ఎస్సై వంశీకృష్ణ వెల్లడించారు.

ఇవీ చూడండి: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.