ETV Bharat / state

రెండు కాళ్లు లేకపోయినా.. బతుకు 'సాగు' చేస్తున్నాడు..! - best farmer in gumlapur

విధి వంచితుడినని ఏనాడు దిగాలు చెందలేదు. పగబట్టిన రోడ్డు ప్రమాదం రెండు కాళ్లను పోగొట్టిందని ఏడుస్తూ కూర్చోలేదు. తన రెక్కల కష్టమే ఆసరాగా ఇష్టమైన వ్యవసాయంలో ధీరుడిగా ముందుకు సాగుతున్నాడీ రైతు. రెండు కాళ్లు లేకపోయినా.. పంట పొలంలో అసలైన కృషీవలుడిగా శ్రమిస్తున్నాడు. పట్టుదలే పెట్టుబడిగా తనకెదురైన వైకల్యాన్ని అధిగమిస్తున్నాడు.

రెండు కాళ్లు లేకపోయినా... బతుకు 'సాగు' చేస్తున్నాడు
farmer Cultivation without two legs gumlapur
author img

By

Published : Jan 26, 2021, 9:11 AM IST

రెండు కాళ్లు లేకపోయినా... బతుకు 'సాగు' చేస్తున్నాడు

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కు చెందిన 62 ఏళ్ల బద్దెనపల్లి అంజయ్య... ఇరవై ఏళ్ల కిందట తీర్థయాత్రలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయారు. అదే ప్రమాదంలో పెళ్లీడుకొచ్చిన కూతురు కాలుని కూడా తొలిగించడం ఆయన బాధను రెట్టింపు చేసింది. వ్యవసాయమంటేనే అమితమైన మక్కువున్న అంజయ్య ఎలాగోలా ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ బతుకు సాగును ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన తరువాత ఏడాది రెండేళ్ల నుంచే చిన్నపాటి పనులు చేసినా... ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవాలంటే మళ్లీ వ్యవసాయం చేయడం తప్ప.. మరో మార్గం లేదని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పమే ఆసరాగా ఇన్నాళ్లుగా నేలతల్లి కడుపున బంగారాన్ని పండించేలా.. పోరాటా పటిమ చూపిస్తున్నారు.

మూడు చక్రాల సైకిల్‌పై పొలం దాక వెళ్తే అక్కడే తన కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న ఎద్దుల బండితో సాగుకు అవసరమైన పనుల్ని చకచకా చేసుకుంటున్నారు. ఇతరుల సాయం అవసరం లేకుండానే రెండు ఎద్దుల సాయంతో పొలాన్ని దున్నడంతోపాటు చదును చేస్తుంటారు. ఇతని కోసమే తామున్నామనేలా రెండు ఎద్దులు కూడా తగిన సహకారాన్ని అందిస్తున్నాయి. సైగలతోపాటు తన మాటలకనుగుణంగా ఇవి పనిచేస్తున్న తీరుని చూస్తే అబ్బురపడాల్సిందే.

సాగులో అధిక దిగుబడులు వచ్చేలా శ్రమిస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. పొలం పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. సాగు దండుగ అని వ్యవసాయాన్ని దూరం చేస్తున్న ఎందరికో అంజయ్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: గుస్సాడీ కనకం.. ‘పద్మశ్రీ’ కిరీటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.