ETV Bharat / state

కుక్కల బెడదకు కు.ని. ఆపరేషన్​తో చెక్​ - కుక్కలకు కు.ని. ఆపరేషన్​ వార్తలు

కుక్కల బెడద నుంచి కరీంనగర్‌ నగర వాసులకు ఉపశమనం లభించనుంది. కుక్కల సంతానోత్పత్తి తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీధి కుక్కల నియంత్రణ పేరిట ఓ నూతన కార్యక్రమాన్ని రూపొందించారు. నగరపాలక కమిషనర్​ క్రాంతితో కలిసి మేయర్​ సునీల్​రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Family planning operations for dogs in karimnagar
కుక్కల బెడదకు కు.ని. ఆపరేషన్​తో చెక్​
author img

By

Published : Jun 6, 2020, 11:36 PM IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో కుక్కల బెడదను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా కాలంలో కుక్కలు వింతగా ప్రవర్తించడమే కాక.. దాదాపు 1000 మందికి పైగా గాయపర్చినట్లు నగరపాలక సంస్థకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కుక్కల సంతానోత్పత్తిని శాస్త్రీయ పద్ధతిలో తగ్గించేందుకు కుటుంబ నియంత్రణకు శ్రీకారం చుట్టారు.

నగరపాలక కమిషనర్‌ క్రాంతితో కలిసి మేయర్ సునీల్‌రావు వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలో దాదాపు 4 వేల కుక్కలు ఉన్నాయని.. ప్రతిరోజూ 20 కుక్కలకు కు.ని. ఆపరేషన్​లు కొనసాగుతాయని మేయర్ సునీల్​రావు స్పష్టం చేశారు. కుక్కలను ఆపరేషన్‌ చేయగానే వదిలేయకుండా.. 4 రోజుల పాటు ఆసుపత్రిలోనే పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంతో కుక్కల సంతానోత్పత్తి తగ్గిపోతుందని మేయర్​ వివరించారు.

కుక్కల బెడదకు కు.ని. ఆపరేషన్​తో చెక్​

ఇదీచూడండి: రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.