.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతగుట్టలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 35 క్వింటాళ్ల నకిలీ మొక్కజొన్న విత్తనాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. విత్తనాల సంచులపై పేరు, బ్యాచ్ నంబర్లు లేవని అధికారులు తెలిపారు. ఇంటి యాజమాని ఓ ప్రైవేటు కంపెనీకి ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. వ్యవసాయ అధికారుల ఫిర్యాదుతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: 'హరిత, నీలి విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలి'