కరీంనగర్ పోలీసులకు నగర పాలక సంస్థ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్ నేతికుంట యాదయ్యలు ముఖ కవచాలను వితరణ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డిని కలిసి వీటిని అందించారు. పోలీస్ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతుండడం వల్లనే కరీంనగర్లో కరోనా నియంత్రణలో ఉందని మేయర్ సునీల్‌రావు అన్నారు. పోలీసుల సేవలు అమూల్యమైనవని ఆయన కొనియాడారు.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'