కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన స్థాయిని మరిచి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సమంజసం కాదని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతీ పార్టీ రాజకీయంగా ఎదగడానికి సభ్యత్వాలు నమోదు చేయడం సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా... పార్టీ అధ్యక్షుడే కాక కేంద్రహోం మంత్రి అనే విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతి పదిహేను రోజులకొకసారి తెలంగాణాకు వచ్చి వీధిపోరాటాలు చేస్తాననడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రజలు శాంతి, అభివృద్దిని కోరుకుంటారే తప్ప వీధిపోరాటాలు కాదని విమర్శించారు. పదిహేనురోజులకొకసారి ఇక్కడికి రావడం కాదు ముందు కేంద్ర జలవనరుల శాఖమంత్రి మంత్రిని పంపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు కృషి చేయాలని వినోద్‌కుమార్ సూచించారు.
ఇవీ చూడండి: భారీస్థాయిలో తెరకెక్కనున్న 'రామాయణ'..