ETV Bharat / state

Etela Rajender Roadshow: 'వాళ్లు ఏమిచ్చినా తీసుకోండి... ఓటు మాత్రం నాకే వేయండి'

కరీంనగర్ జిల్లా జమ్మికుంట​లో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్​షో (Etela Rajender Roadshow) నిర్వహించారు. అధికార తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ఎన్నికల్లో గెలవదని స్పష్టం చేశారు.

Etela Rajender Roadshow
Etela Rajender Roadshow
author img

By

Published : Oct 12, 2021, 4:04 PM IST

ఓట్ల కోసం అధికార పార్టీ ఎన్ని డబ్బులిచ్చినా తీసుకోవాలని... ఓటు మాత్రం తనకే వేయాలంటూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Bjp Candidate Etela Rajender) కోరారు. జమ్మికుంటలో ఆయన భారీ రోడ్‌షో (Etela Rajender Roadshow) నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ ఎన్నికల్లో తన వెంట ఉన్న వాళ్లందరిని తీసుకెళ్లి మంత్రి హరీశ్​రావు... తనను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

నాయకులను కొనుగోలు చేసినా ప్రజలు మాత్రం తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పెద్దఎత్తున పంచుతారని ఆ డబ్బు మనదేనన్నారు. ప్రలోభ పెట్టేందుకు డబ్బు ఇచ్చినా.. దళితబంధు ఇచ్చినా.. సిమెంట్ రోడ్లు ఇచ్చినా.. మీకు గౌరవం ఇచ్చినా అది కేవలం తన వల్లనే అన్న విషయం మాత్రం మరచిపోవద్దని సూచించారు. ఓటు మాత్రం కమలం పువ్వు గుర్తుకే వేయాలని కోరారు.

ఇయ్యాళ ఉన్నాయన రేపు ఉంటలేడు నాతోని... దొరికినోడిని దొరికినట్లుగా హరీశ్​రావు కండువాలు కప్పి గుంజుకుంటుండు. మీకు తెలుసు ఇదే మున్సిపాలిటీ ఎంత మందిని గెలిపించుకున్నం. వాళ్లకు మీ ఆశీర్వాదం లేకుండెనా? నా ఆశీర్వాదం లేకుండెనా? మన అండదండలున్నా తీసుకుపోయిన్రు. నేను ఒకటే అంటున్నా... ఊరంతా ఒకదారి ఊసరవెళ్లిది మరోదారి. నాయకులందరినీ మీరు తీసుకుపోయిన్రు. కానీ ప్రజలంతా ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు ఈటలవైపు ఉన్నరు. మీరంతా 30వ తారీఖు నాడు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.

-- ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి

ఈటల రాజేందర్ రోడ్​షో

ఇదీ చూడండి: Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.