ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : అనాథ చిన్నారులకు ఎన్నారైల సాయం - Karimnagar District latest News

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్ పరిధి ఎరడపల్లిలో అనాథ చిన్నారులపై ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్​లో ప్రసారమైన 'పాపం పసివాళ్లు' కథనాలకు ఎన్నారైలు స్పందించారు. వారికి సాయం అందించారు. తమకు సాయం అందడంపై చిన్నారులు అభినయ, ఆలయ ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : అనాథ చిన్నారులకు ఎమ్మెల్యే రవిశంకర్ సాయం

author img

By

Published : Sep 3, 2020, 3:40 PM IST

Updated : Sep 3, 2020, 8:39 PM IST

ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులపై... 'పాపం పసివాళ్లు' పేరిట ఈటీవీ తెలంగాణ ప్రసారం చేసిన కథనానికి అపూర్వ స్పందన లభిస్తోంది. అమెరికాలోని ఎన్నారైలు పంజాల నరేశ్, మధుప్రియల ఆధ్వర్యంలో పలువురు ఎన్నారైలు కలిసి చిన్నారులు అభినయ, ఆలయ పేరిట ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. ఆయా చెక్కులను బాధిత చిన్నారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​ చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లిలో అభినయ, ఆలయ అనే చిన్నారులు..తల్లిదండ్రులను కోల్పోయారు. బాబాయ్ సంరక్షణలో ఉన్న చిన్నారుల భవిష్యత్ కు భరోసా ఇవ్వాలని కోరుతూ... గతనెల 20న ఈటీవీ తెలంగాణలో కథనం ప్రసారమైంది. ఈ కథనానికి స్పందించిన మానవతామూర్తులు ... ఇప్పటి వరకు ఒక్కొక్కరి పేరిట 4 లక్షలకు పైగా ఆర్థికసాయం అందించారు.

అపూర్వ స్పందన...

ఆరునెలల తేడాలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులపై ఈటీవీ కథనానికి అపూర్వ స్పందన లభించింది. అమ్మ నాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల గురించి ఈటీవీ భారత్​, ఈటీవీ తెలంగాణలో గత నెల 20న ప్రసారమైన కథనానికి మానవతావాదులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. బాధిత కుటుంబీకులను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాలని ఎమ్మెల్యే రవిశంకర్ పిలుపునిచ్చారు.

ఇప్పటి వరకు ఒక్కో బాధితురాలి పేరిట రూ .4 లక్షల 20వేల చొప్పున డిపాజిట్​తో పాటు ఆర్థిక సాయం అందించారని చిన్నారులు తెలిపారు. తమకు సాయం అందడంపై ఈటీవీ భారత్- ఈటీవీ తెలంగాణకు బాధితురాళ్లు కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సాయం ఎనలేదని, వారికి రుణపడి ఉంటామని అన్నారు.

ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : అనాథ చిన్నారులకు ఎమ్మెల్యే రవిశంకర్ సాయం

ఇవీ చూడండి : విషాదం.. ఫ్యాన్​కు ఉరేసుకుని దంపతుల బలవన్మరణం

Last Updated : Sep 3, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.